“విరాట పర్వం” ట్రైలర్ లాంచ్ కి వేదిక ఖరారు.!

Published on Jun 4, 2022 11:01 am IST

టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విరాట పర్వం”. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాల చేత ఫైనల్ గా థియేట్రికల్ రిలీజ్ కే సిద్ధం అయ్యింది. అయితే మేకర్స్ ఈ మే 5న అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తూ అనౌన్స్ చెయ్యగా ఇపుడు ఈ ట్రైలర్ లాంచ్ కి గాను వేదికని కన్ఫర్మ్ చేశారు.

ఈ ట్రైలర్ ని రేపు మే 5న కర్నూల్ లో గ్రాండ్ ఈవెంట్ నడుమ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు అనౌన్స్ చేసారు. అక్కడి ఫ్యాన్స్ ని సిద్ధంగా ఉండమంటూ ఇంట్రెస్టింగ్ వీడియో తో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో రానా సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :