“మేజర్” సినిమాలో ఉన్నందుకు గర్వపడుతున్న విలక్షణ నటుడు.!

Published on May 31, 2022 8:00 am IST


ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా పాన్ ఇండియా సినిమా “మేజర్”. యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శశి కిరణ్ తిక్క కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ భారీ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ లో కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు వేస్తున్న స్పెషల్ ప్రీ ప్రీమియర్ షోస్ కి గాను అనూహ్య స్పందన అన్ని చోట్లా వస్తుండడంతో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు. మేజర్ ఒక హృదయాన్ని హత్తుకునే సినిమా అని ఖచ్చితంగా ఈ చిత్రం అందరినీ కదిలిస్తుంది.

ఇలాంటి సినిమాలో నేను కూడా ఒక భాగం అయ్యినందుకు చాలా గర్వపడుతున్నానని ఈ సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దని ప్రకాష్ రాజ్ తెలిపారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 3 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :