రామ్ చరణ్ తో చేతులు కలపనున్న విలక్షణ నటుడు !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే గోదావరి జిల్లాలో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో మరో షెడ్యూల్ జరుపుకుంటోంది. నగరంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ టీమ్ మాత్రం చిత్రీకరణ ఆపడంలేదు. చరణ్ కూడా గ్యాప్ అనేదే తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటూ చిత్రీకరణను మరింత వేగవంతం చేస్తున్నాడట.

ఇకపోతే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా త్వరలోనే ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2007 లో రిలీజైన ‘జగడం’ అనే సినిమాలో మాత్రమే నటించిన ప్రకాష్ రాజ్ మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ కూడా ప్రకాష్ రాజ్ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో రూపొందించినట్టు సమాచారం. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నైపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.