“హను మాన్” నుంచి ఇంట్రెస్టింగ్ రోల్ లో విలక్షణ నటి.!

Published on Mar 4, 2022 10:55 am IST


మన భారత దేశపు అందులోని మన టాలీవుడ్ నుంచి మొట్ట మొదటి సూపర్ హీరోపై చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమానే “హను మాన్”. టాలీవుడ్ యంగ్ అండ్ ఫ్యాషనేటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ “హను మాన్” గా నటిస్తుండగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇదిలా ఇపుడు ఈ సినిమాలో మరో విలక్షణ నటి యాడ్ అయ్యినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆమెనే సౌత్ ఇండియా వెర్సిటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. తన లుక్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు.

మరి ఇందులో కూడా ఈమె సాలిడ్ నెగిటివ్ రోల్ లోనే నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓ అగ్రెసివ్ లుక్ లో “అంజమ్మ” అనే పాత్ర చేస్తున్నట్టు చూపించారు. మరి తన పేరుతో బహుశా తేజ రోల్ తల్లి పాత్ర కూడా కావచ్చని అనిపిస్తుంది. మరి వేచి చూడాలి ఈమె పాత్ర ఎంత బలంగా ఉంటుందో అనేది.

సంబంధిత సమాచారం :