“ఎన్టీఆర్ 30” పై వెరీ ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on Jun 18, 2022 11:09 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జస్ట్ మోషన్ పోస్టర్ టీజర్ తోనే ఎనలేని హైప్ తెచ్చిన ఎన్టీఆర్ ఈ చిత్రంతో అయితే ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్లో పాగా వెయ్యడం గ్యారెంటీ అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ లో అన్ని పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ సినిమాని కొరటాల తన గత సినిమాల రూల్ ని బ్రేక్ చేసి తీస్తున్నట్టు టాక్. అంటే అసలు ఎలాంటి మెసేజ్ లేకుండా కంప్లీట్ మాస్ సినిమాగా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే ఆడియెన్స్ కి మామూలు ట్రీట్ ఉండదని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :