చరణ్ తో న్యూజీలాండ్ లో స్టార్ట్ చేసిన శంకర్ !

చరణ్ తో న్యూజీలాండ్ లో స్టార్ట్ చేసిన శంకర్ !

Published on Nov 14, 2022 11:00 AM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఎట్టకేలకు మరో కొత్త షెడ్యూల్ కి సన్నద్ధం అయింది. ఈ కొత్త షెడ్యూల్ న్యూజీలాండ్ లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు కియారా అద్వానీ కూడా జాయిన్ అయింది. ఈ షెడ్యూల్‌లో పాటల సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట.

చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు