“RRR” పై ఆసక్తికర అప్డేట్స్.!

“RRR” పై ఆసక్తికర అప్డేట్స్.!

Published on Oct 9, 2021 12:00 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబోలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్ గానే ఈ సినిమా తాలూకా కొత్త రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

ఆయితే ఈ భారీ చిత్రంపై ఇప్పుడు మరింత ఆసక్తికర అప్డేట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి వాటి ప్రకారం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ ఆల్రెడీ తన పాత్రకి డబ్బింగ్ స్టార్ట్ చేసారట.

అంతేకాకుండా మరో టాక్ ఏమిటంటే ఈ సినిమాకి ప్రమోషన్స్ పరంగా కూడా చిత్ర యూనిట్ చాలా కేర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆయా ఇండస్ట్రీలకు సంబంధించి ఆ భాషల్లోనే యూనిట్ సభ్యులు మాట్లాడుతూ పాల్గొననున్నారని ఇప్పుడు వైరల్ అవుతున్న టాక్. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు