నీకు తమిళనాడుని పాలించే హక్కు లేదు అంటున్న దర్శకుడు?


రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మీద తమిళనాడులో ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, వస్తే ఊరుకునేది లేదని తమిళనాడు సంఘాలు మధ్య రజనీకాంత్ ఆలోచనలు ఒక్కసారి కన్ఫ్యూజన్లో పడిపోయాయి. ఇప్పుడు రజనీకాంత్ కి సినిమా ఇండస్ట్రీలో పెద్దల నుంచి కూడా రాజకీయ రంగప్రవేశం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సీనియర్ దర్శకులు, రజనీకాంత్ కి ఎన్నో హిట్లు ఇచ్చిన పాతతరం దర్శకులు భారతీరాజా, రజనీ పొలిటికల్ ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నువ్వు తమిలియన్ కాదు. ఒక తమిళ వ్యక్తి కాని వాడికి తమిళ ప్రజలని పాలించే హక్కు లేదు, ఉండదు అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అయితే దీనిపై రజనీ ఏమంటాడు అనేది చూడాలి.