అల్లు అర్జున్ సినిమాలో అలనాటి స్టార్ హీరో !

28th, March 2017 - 08:29:27 AM


ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్న స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాతి సినిమాను స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతోందట. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరో అర్జున్ నటించనున్నారని తెలుస్తోంది.

శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘జెంటిల్మెన్, ఒకే ఒక్కడు’ సినిమాలతో జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించిన నటుడు అర్జున్ ప్రస్తుతం పలు భాషల్లోని సినిమాల్లో నెగెటివ్, పాజిటివ్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలోనో ఒక ప్రధాన పాత్ర కోసం వంశీ ఈయన్ను ఎంచుకున్నారట. అయితే ఈ విషయంపై చిత్ర టీమ్ నుండి అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.