సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చివరిసారిగా లాల్ సలాం అనే మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఆయన వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టైయాన్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
లేటెస్ట్ ఏంటంటే, ఈ చిత్రం లో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చెసుకున్నారు రజినీకాంత్. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్ట్ లో వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుపాటి మరొక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
And it is a wrap for our Thalaivar! ???????? Superstar @rajinikanth completes filming his portion for Vettaiyan. ????️ ????#VETTAIYAN ????️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4… pic.twitter.com/YPcljJ6vVn
— Lyca Productions (@LycaProductions) May 13, 2024