వైరల్ : “RRR” లో చరణ్ – టైగర్ సీక్వెన్స్ గ్రాఫికల్ వర్క్ చూసారా?

Published on May 19, 2022 8:00 am IST

మన ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ పాన్ ఇండియా మరియు యాక్షన్ సినిమాలను పక్కన పెడితే బెస్ట్ గ్రాఫికల్ వర్క్ ఉన్న సినిమాల్లో కూడా మన తెలుగు చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి చేసిన ఈ భారీ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా కూడా చాలా స్కోప్ ఉంది.

నిజానికి అయితే ఈ సినిమా చూసాక రాజమౌళి కెరీర్ లో బెస్ట్ గ్రాఫిక్స్ చూపించిన సినిమా ఇదే అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో అడవి మృగాలను చూపించిన తీరు బాగుంటుంది. ఎన్టీఆర్ సీన్స్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా ఆ పులి, చిరుత తోడేలు వంటివి అన్నీ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాయి.

అయితే వాటిలో కంప్లీట్ క్రెడిట్ మాత్రం ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస మోహన్ మరియు తన టీం కే చెందుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా అయితే ఇంటర్వెల్ లో రామ్ చరణ్ మరియు టైగర్ కి మధ్య జరిగే చిన్నపాటి ఐకానిక్ సీక్వెన్స్ కి ఎలా వర్క్ చేసారో అనేది వీడియోలో చూపించి బ్రేక్ డౌన్ అందించారు.

అలాగే దీనితో పాటుగా చరణ్ పై పాము కాటేసే సీన్ గ్రాఫిక్స్ కూడా చూపించారు. ఆ సీన్స్ అల్ జహ్రా స్టూడియోస్ వాలారు చేసినట్టుగా తెలిపారు. దీనితో ఈ వి ఎఫ్ ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :