మాస్ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న ‘వరిసు’ ఫస్ట్ సాంగ్ ప్రోమో

మాస్ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న ‘వరిసు’ ఫస్ట్ సాంగ్ ప్రోమో

Published on Nov 4, 2022 1:50 AM IST


ఇలయతలపతి విజయ్ హీరోగా ఊపిరి, మహర్షి సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ వారసుడు. తమిళ్ లో వరిసు పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కుష్బూ, స్నేహ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న వరిసు మూవీ నుండి ‘రంజితమే’ అనే పల్లవి తో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. ఈ సాంగ్ ని ఎం ఎం మానసి తో కలిసి స్వయంగా హీరో విజయ్ ఆలపించగా లిరిక్స్ ని వివేక్ అందించారు. మంచి మాస్ బీట్ ట్యూన్ తో ఆకట్టుకునే లిరిక్స్ తో తెరెక్కిన ఈ సాంగ్ ప్రోమోలో మరొక్కసారి తన మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారు విజయ్. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. కాగా ఫుల్ సాంగ్ నవంబర్ 5 రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు