“నాట్యం” చిత్ర యూనిట్ కి వెంకయ్య నాయుడు అభినందనలు!

Published on Oct 22, 2021 6:08 pm IST

సంధ్యా రాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు నిశ్రింఖల ఫిల్మ్స్ పతాకం పై దిల్ రాజు మరియు సంధ్యా రాజు లు సంయుక్తం గా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం నేడు థియేటర్ల లోకి విడుదల కాగా, ఈ చిత్రం పై వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేస్తూ, చిత్ర యూనిట్ ను అభినందించారు.

నాట్య కళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి సంధ్యా రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాట్యం చక్కని చిత్రం అని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి లో కళలకు ఇచ్చిన ప్రాధాన్యత ను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More