‘కత్రినా – విక్కీ’ పెళ్లి డేట్ ఫిక్స్ ?

Published on Nov 7, 2021 5:48 pm IST

హీరోయిన్ కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ లవ్‌ బర్డ్స్‌ త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారని గత కొన్ని రోజులుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక డేట్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ పెళ్లి డేట్ ఎప్పుడంటే.. డిసెంబర్ 7వ తేదీ అట. రాజస్థాన్‌లో ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది.

కాకపోతే తమ పెళ్లి గురించి ఎక్కడా బయటకు పొక్కకుండా ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పైగా వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగిపోతున్నాయట. కాకపోతే వీళ్ళు మాత్రం తమ పెళ్లి వార్తను చాలా రహస్యంగా ఉంచుతున్నారట. అందుకే ఇంకా వెడ్డింగ్‌ ఇన్విటేషన్స్‌ కూడా ఎవరికీ పంపలేదని టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :

More