త్వరలో హిందీ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న వెంకీ మామ..!

Published on Jun 1, 2022 2:30 am IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఓ కీలకమైన పాత్రను పోషించనున్నారు. జూన్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో వెంకటేశ్ పాల్గొంటారు.

‘ఆచార్య’ సినిమా కోసం ‘ధర్మస్థలి’ టెంపుల్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి సొంత స్థలంలో వేసిన ఈ సెట్ ను అలాగే ఉంచారు. దీంతో ఆ సెట్‌ని ఇప్పుడు సల్మాన్ సినిమాకోసం వాడబోతున్నారు. ఆ సెట్‌లోని సీన్స్‌లో వెంకటేశ్ జాయిన్ కానున్నట్టుగా చెబుతున్నారు. సల్మాన్‌కి, వెంకటేశ్‌కి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆయన అడగ్గానే ఈ సినిమాలో చేయడానికి వెంకటేశ్ అంగీకరించారట. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :