పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో కల్కి 2898 ఏడి మూవీ కూడా ఒకటి. యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
నిన్న షూటింగ్ ప్రారంభం అయిన ఈ సాంగ్ నేటితో పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ కోసం ప్రభాస్ వామప్ చేస్తూ షూ వేసుకున్న కాలిని కదుపుతున్న చిన్న వీడియో బైట్ ని నేడు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసింది కల్కి టీమ్. ప్రస్తుతం ఆ వీడియో బైట్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా కల్కి 2898 ఏడి మూవీ మే 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
Just the warm up… #Prabhas #Kalki2898AD on ???????????? ????????????, ????????????????. pic.twitter.com/3cH1O3FffV
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 23, 2024