వైరల్ : రణబీర్ కపూర్ యానిమల్ నుండి వీడియో లీక్

Published on Jun 3, 2023 7:30 am IST

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ యానిమల్. పరిణీతి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. బిగినింగ్ నుండి సూపర్ క్రేజ్ కలిగిన ఈ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ నుండి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేయగా దానికి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

యానిమల్ సినిమాని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ మరియు మురాద్ ఖేతాని నిర్మిస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ సెట్స్ నుండి తాజాగా ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రణబీర్‌ లెక్చరర్‌గా కనిపించారు. అలానే ఈ వీడియోలో ఆయన లుక్‌లచూసిన పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. లీక్డ్ వీడియో పోస్ట్ చేయడం సరైనది కాదు కాబట్టి మేము పోస్ట్ చేయడం లేదు. కాగా ఈ మూవీని గ్రాండ్ గా ఆగష్టు 11న పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :