లేటెస్ట్ : ఓటిటి లో ‘విడుదల పార్ట్ 1’ సెన్సేషనల్ రికార్డు

లేటెస్ట్ : ఓటిటి లో ‘విడుదల పార్ట్ 1’ సెన్సేషనల్ రికార్డు

Published on May 13, 2023 1:00 AM IST


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో కోలీవుడ్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 1.తెలుగు లో విడుదల టైటిల్ తో అలానే తమిళ్ లో విడుతలై టైటిల్ తో రిలీజ్ అయింది. థ్రిల్లింగ్ అంశాలతో నాచురల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల తమిళ్, తెలుగు భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఈ మూవీ అన్ కట్ ఫుల్ వెర్షన్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ఓటిటి మాధ్యమంలో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీ తమిళ్ వర్షన్ ప్రస్తుతం జీ 5 లో భారీ స్థాయి వ్యూస్ తో ఒక సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది. కాగా విడుదల పార్ట్ 1 మూవీ వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకున్న మూవీగా రికార్డు అందుకుందని జీ 5 తమిళ్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాగా తమ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ ఉండడంతో విడుదల మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేసారు. ఇక విడుదలై పార్ట్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు