రాజమౌళి సినిమాలో నటిస్తానంటున్న బాలీవుడ్ హీరోయిన్ !
Published on Nov 23, 2016 11:18 am IST

vidya-balan-12

ప్రముఖ బాలీవుడ్ నటి, నేషనల్ అవార్డ్ విజేత విద్యాబాలన్ తెలుగు సినిమాలపై తన మక్కువను, తెలుగులో తన ఎంట్రీ గురించి వివరించింది. ఆమె తాజాగా నటించిన ‘కహాని 2’ సినిమా ప్రమోషన్లో భాగంగా నిన్న హైదరాబాద్ కు వచ్చిన ఆమె తెలుగులో ఎప్పుడు నటిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా ‘నాకు తెలుగులో నటించాలనే ఉంది. సరైన స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా నటిస్తా. రాజమౌళి సినిమాలో అవకాశమైతే ఇంకా ఆనందం’ అన్నారు.

అలాగే ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ చూశానని, చాలా బాగా నచ్చిందని, ‘బాహౌబలి 2’ కోసం ఎదురు చూస్తున్నానని, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఉంది. సినిమాని త్వరగా రిలీజ్ చెయ్యమని రాజమౌళికి చెప్పండని సరదాగా అన్నారు. ఇక తన చిత్రం కహాని 2 పాత కహానికి సీక్వెల్ కాదని, ఇది పూర్తిగా కొత్త కథని తప్పకుండా అందరికీ నచ్చుతుందని, డిసెంబర్ 2న రిలీజవుతుందని అన్నారు.

 
Like us on Facebook