వైరల్ గా మారిన విఘ్నేష్ శివన్ పోస్ట్!

Published on Jun 9, 2022 11:00 am IST

పెళ్లికి ముందు నయనతార గురించి ఒక అందమైన పోస్ట్ చేశారు విఘ్నేష్ శివన్. లేడీ సూపర్ స్టార్ నయనతార, నటుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ మరికొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈరోజు మహాబలిపురంలో వివాహ వేడుక జరగనుంది. గ్రాండ్ ఈవెంట్‌కు ముందు, విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి నయనతార గురించి ఒక అందమైన పోస్టును పంచుకున్నారు.

అతను వరుస ఫోటోలను పోస్ట్ చేసి, ఈ రోజు జూన్ 9 మరియు ఇది నయన్ వివాహం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అతను తనకు ముఖ్యులైన వారి ముందు పెళ్లి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం మరియు మంచి స్నేహితుల ముందు అధికారికంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :