వైరల్ అవుతోన్న విఘ్నేష్ శివన్ – నయనతార సెల్ఫీ

Published on Apr 17, 2022 9:00 pm IST

స్టార్ హీరోయిన్ నయనతార మరియు నిర్మాత, దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌ లో ఉన్నారు. వారిద్దరూ రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. నయనతార రాబోయే చిత్రం కతువాకుల రెండు కాదల్ చిత్రం కూడా బ్యానర్‌పై సహ నిర్మాతగా ఉంది.

ఈ రోజు, విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక సెల్ఫి ఫోటో ను షేర్ చేయడం జరిగింది. అతను, నయనతార తో కలిసి ఉన్న రెండు సెల్ఫీలను పంచుకున్నాడు. చివరి ప్రక్రియలో అన్ని గందరగోళాల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం సమయం అంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. సెన్సార్‌కు సిద్ధమవుతున్న సినిమా, మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈరోజు నుండి అన్ని అప్‌డేట్‌లు వస్తాయి అని అన్నారు. తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ లో కూడా నయనతార కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :