ఇంతకంటే గొప్ప కాంబినేషన్‌ ను ఊహించలేం !

Published on Apr 3, 2022 8:06 pm IST

విజయ్ సేతుపతి హీరోగా, సమంత – నయనతార కీలక పాత్రల్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా నిర్మాత కూడా నయనతారనే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో చిత్ర ఫొటోలను పోస్టు చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇంతకీ విఘ్నేష్ శివన్ ఏమి ట్వీట్ చేశాడంటే.. అసాధారణ నటీ నటులతో పని చేశాను. నా సినిమాకి అలాంటి వారు దొరకడం నా అదృష్టం, అసలు ఇంతకంటే గొప్ప కాంబినేషన్‌ను ఊహించలేము. బెస్ట్ యాక్టర్ విజయ్‌సేతుపతి, అందమైన ప్రొఫెషనల్‌ నటి నయనతార, ప్రతిభావంతమైన నటి సమంత వీళ్లంతా ఈ చిత్రాన్ని అద్భుతంగా ముందుకు నడిపించారు’ అంటూ ఈ దర్శకుడు కామెంట్స్ చేశాడు.

ఇక ఈ సినిమా కథ ఓ వెరైటీ లవ్ స్టోరీ ఆధారంగా రాబోతుందని తెలుస్తోంది. కాగా విఘ్నేష్ శివన్ లో మంచి కామెడీ స్టైల్ ఉంది. ఆ కోణంలోనే ఈ సినిమా కూడా ఫన్నీగా ఉంటుందట. నిర్మాత లలిత్‌కుమార్‌ సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ కోసం నయనతార, విఘ్నేష్‌ శివన్‌ రౌడీపిక్చర్స్‌ సంస్థ ఫస్ట్‌కాపీ బేస్‌లో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఈనెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు

సంబంధిత సమాచారం :