ఆనంద్ దేవరకొండ “గం గం గణేశా” టీజర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Sep 15, 2023 10:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రం సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం గం గం గణేశా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కు సంబందించిన టీజర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను చూసిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదిక గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆనంద్ దేవరకొండ ట్రిప్పి స్టఫ్ చేస్తున్నాడు. ఇది చాలా సరదాగా కనిపిస్తుంది. ఇది చాలా బాగా చేసావ్ ఆనంద్ దేవరకొండ. గం గం గణేశా టీజర్ బాగుంది. ఇప్పటికే నేను పాటలు విన్నాను. ఆల్బమ్ పట్ల అసూయ పడుతున్నాను. నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ త్వరలో వస్తుంది. ఈ చిత్రం వెనుక ఉన్న టీమ్ కి అభినందనలు అని తెలిపారు విజయ్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :