పుష్ప నెక్స్ట్ లెవెల్ తెలుగు సినిమా అంటున్న విజయ్…తగ్గేదేలే అంటున్న బన్నీ!

Published on Dec 15, 2021 7:15 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో సమంత ఆడి పాడింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకో రెండు రోజుల్లో పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది అని సోషల్ మీడియా వేదిక గా తెలిపారు. మొదటి రోజు మొదటి ఆట కోసం ఎదురు చూస్తున్నా అని అన్నారు. ట్రైలర్, పాటలు, విజువల్స్, పెర్ఫార్మెన్స్, అంతా మాస్ అంటూ చెప్పుకొచ్చారు విజయ్. నెక్స్ట్ లెవెల్ తెలుగు సినిమా అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాక అల్లు అర్జున్, రష్మిక మరియు డైరక్టర్ సుకుమార్ లు విజయం సాధించాలి అంటూ తెలిపారు.

విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల కి అల్లు అర్జున్ స్పందించారు. థాంక్స్ బ్రదర్, మీ హృదయాలను గెలుస్తాం అని అనుకుంటున్నాం, రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. శుక్రవారం రోజు తగ్గేదేలే అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :