హార్స్ రైడింగ్ ఎంజాయ్ చేస్తున్న “లైగర్” విజయ్!

Published on Nov 21, 2021 6:05 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లాస్ వెగాస్ లో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షెడ్యూల్ లో ప్రముఖ లెజెండరీ బాక్సర్ అయిన మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది. అంతేకాక కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది.

తాజాగా విజయ్ దేవరకొండ మరియు ఈ చిత్రం లో నటిస్తున్న హీరోయిన్ అనన్య పాండే లు కలిసి ఉన్న ఫోటో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో లో విజయ్ మరియు అనన్య లు ఇద్దరూ కూడా హార్స్ పై ఉండటం మనం చూడవచ్చు. హార్స్ రైడింగ్ సెషన్ ను వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటో ను చూస్తే అర్ధం అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా తరహా లో వివిధ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More