సెన్సేషనల్ రెస్పాన్స్ తో మహేష్, విజయ్ ల సాంగ్స్.!

Published on Feb 27, 2022 9:49 am IST

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు కాగా మరోపక్క తమిళ నాట ఇళయ థలపతి జోసెఫ్ కూడా ఒకరు. మరి ఈ ఇద్దరి బాక్సాఫీస్ స్టామినా కానీ సోషల్ మెడిలో రీచ్ గాని వేరే లెవెల్లో ఉంటాయి అని చెప్పాలి.

మరి ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ హీరోలుగా నటించిన లేటెస్ట్ సినిమాలు “సర్కారు వారి పాట” మరియు “బీస్ట్” నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్స్ భారీ రెస్పాన్స్ లను అందుకున్నాయి. మరి మహేష్ కళావతి సాంగ్ లేటెస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ భారీ రెస్పాన్స్ అందుకోగా..

థలపతి అరబిక్ కుతు సాంగ్ 12 రోజుల్లో ఏకంగా 100 మిలియన్ మార్క్ ని అందుకొని సెన్సేషన్ ని నమోదు చేసింది. దీనితో ఈ ఇద్దరు స్టార్ ల సినిమాలు ఫస్ట్ సింగిల్ ఒకే టైం లో అదరగొట్టాయని చెప్పాలి. మరి మహేష్ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా విజయ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :