ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్, సామ్ ల “ఖుషి”

Published on Oct 1, 2023 7:03 am IST

మన టాలీవుడ్ యూత్ సెన్సేషన్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా “ఖుషి”. మరి మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం సూపర్ హిట్ కాగా విజయ్ మరియు సమంత లకి మంచి డీసెంట్ కం బ్యాక్ లా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా అయితే థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఓటీటీ లో అయితే అందుబాటులోకి వచ్చేసింది.

మరి ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :