హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా (16) ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మీరా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే మీరా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మీరా 12వ తరగతి చదువుతోంది. మీరా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆమె తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మా 123తెలుగు.కామ్ తరఫున మీరా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.