వైరల్ : హృదయాలు కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ స్వీట్ గెస్చర్.!

వైరల్ : హృదయాలు కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ స్వీట్ గెస్చర్.!

Published on May 27, 2023 8:02 PM IST

కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన లేటెస్ట్ ఎమోషనల్ మెసేజ్ డ్రామా “బిచ్చగాడు 2” కోసం తెలిసిందే. బిగ్గెస్ట్ సక్సెస్ బిచ్చగాడు 1 కి సక్సెస్ సినిమాగా కొత్త స్టోరీతో వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించింది. మరి దీనితో అయితే విజయ్ ఆంటోనీ లేటెస్ట్ గా సక్సెస్ టూర్ ని కూడా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయగా ఈరోజు వచ్చిన ఓ బ్యూటిఫుల్ వీడియో అయితే అందరి హృదయాలు కదిలిస్తుంది.

తాను సినిమాలో చూపించిన బిక్షాటన చేసే వారిని ఒక పూట అయినా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని చూపించిన తాను రియల్ లైఫ్ లో చేసి చూపించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రి లోనే కొందరు పెద్దలు చిన్నారులను ఓ స్టార్ హోటల్ కి అందరినీ తీసుకెళ్లి స్వయంగా అందరికీ వడ్డించి డ్రింక్స్ అందించి కడుపు నిండా అన్నం పెట్టాడు.

దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే కాకుండా ఆడియెన్స్ ని మరింత కదిలించింది. మరి ఇందులో విజయ్ వారితో మాట్లాడి వారితో ఫోటోలు కూడా తీసుకొని ఆ కొద్దిసేపు అయినా వారి కళ్ళలో ఆనందం నింపి అక్కడ నుంచి వెళ్ళాడు. దీనితో విజయ్ ఆంటోనీ తన స్వీట్ గెస్చర్ తో ప్రతి ఒక్కరి హృదయాలను తాను గెలుచుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు