తలపథి విజయ్ “బీస్ట్” యూఎస్ కలెక్షన్స్

Published on Apr 14, 2022 7:01 pm IST

విజయ్ నటించిన బీస్ట్ చిత్రం నిన్న విడుదలై సౌత్ అంతటా మంచి హైప్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే మౌత్ టాక్ బాగా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఈ సినిమా రెండు రోజుల నుంచి తక్కువ ఆక్యుపెన్సీని చూస్తోంది. యుఎస్‌లో, ఈ చిత్రం ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు $799K వసూలు చేయడం జరిగింది.

కేజీఎఫ్ 2 యూఎస్ లో ఈరోజు విడుదలైంది. మరియు మంచి మౌత్ టాక్ కారణంగా మరింత ఆక్యుపెన్సీని చూస్తుంది, రాబోయే రోజుల్లో బీస్ట్ చిత్రం కలెక్షన్స్ కచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

సంబంధిత సమాచారం :