రీమేక్ తో ఒరిజినల్ దర్శకునితో పోటీ.. ఇదే రచ్చ!

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మన తెలుగు నుంచి కొన్ని అలాగే తమిళ్ సినిమా నుంచి కూడా పలు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ క్లాష్ కోసం రచ్చ నడుస్తుంది. గత కొన్నాళ్ల నుంచి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమా జన నాయకుడు మన టాలీవుడ్ దర్శకుడు అనీల్ రావిపూడి చేసిన భగవంత్ కేసరి రీమేక్ అని టాక్ ఉంది.

అది నిన్న ట్రైలర్ తో ఖరారు అయ్యింది. దీనితో ఆల్రెడీ తెలుగులో చేసిన సినిమా తమిళ్ లో మళ్ళీ రీమేక్ చేసి అదే తెలుగులో మళ్ళీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండడం కోసమే ఆడియెన్స్ లో చర్చ నడుస్తుంది. అంతే కాకుండా ఏదైతే ఒరిజినల్ సినిమా భగవంత్ కేసరి సినిమా చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి నుంచి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు తోనే సంక్రాంతి పోటీకి తెస్తుండడం గమనార్హం. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ సిచుయేషన్ లో ఎవరి సినిమా ఎలా ఉంటుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version