‘సమంత – విజయ్’ సినిమాలో విజయ్ క్యారెక్టర్ అదే !

‘సమంత – విజయ్’ సినిమాలో విజయ్ క్యారెక్టర్ అదే !

Published on Jul 10, 2022 6:10 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంది ?, పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ? అనేది మెయిన్ కథ అట.

అలాగే ఈ సినిమాలో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమా పై ప్రత్యేక ఆకర్షణ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు