లోకేష్ పై ఇంట్రెస్ట్ చూపిస్తోన్న విజయ్ దేవరకొండ !

Published on Aug 15, 2022 9:00 am IST

విక్రమ్ సినిమాతో సూపర్ హిట్‌ కొట్టి సెన్సేషనల్ డైరెక్టర్‌ అయిపోయాడు ‘లోకేష్ కనగరాజ్’. ‘మానగరం’ మూవీతో డైరెక్టర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసిన లోకేష్ కనగరాజ్.. మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించారు. ఆ తర్వాత కార్తితో చేసిన ఖైదీ చిత్రం కూడా భారీ విజయం సాధించింది. అప్పటి నుంచి లోకేష్ కనగరాజ్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా లోకేష్ కనగరాజ్ గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ తాజాగా ‘లైగర్‌’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఈ మధ్యనే నేను లోకేశ్‌ కనగరాజ్‌ తీసిన ‘విక్రమ్‌’ సినిమా చూశాను. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆయన సినిమాటిక్‌ వరల్డ్‌ లోకి నేను కూడా వెళ్లాలనుకుంటున్నాను. త్వరలోనే నాకు ఆయన్నుంచి ఫోన్‌ వస్తుందని భావిస్తున్నాను’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :