ఆనంద్ దేవరకొండకు ఇచ్చే ప్రిఫరెన్స్ చూసి విజయ్ దేవరకొండకు మండిపోయేదట..!

ఆనంద్ దేవరకొండకు ఇచ్చే ప్రిఫరెన్స్ చూసి విజయ్ దేవరకొండకు మండిపోయేదట..!

Published on Oct 26, 2021 2:07 AM IST


యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి చేసిన చిట్ చాట్ “గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్” ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా “పుష్పక విమానం” రిలీజ్‌కి రెడీ అవుతున్న సందర్భంగా ఈ ఇద్దరు బ్రదర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి టాలీవుడ్ లో హీరోలు అయ్యేదాకా వీరి లైఫ్ లో జరిగిన అనేక ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. మరీ ఈ ఇంటర్వ్యూ హైలైట్స్‌ని చూద్దాం రండి.

విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైమ్ నుంచే హాస్టల్‌లో ఉండేవారట. అయితే చదువుల్లో ఆనంద్ ముందు ఉండేవాడని, ప్రతి సబ్జెక్ట్ లో 100కు 100 మార్కులు వచ్చేవని, విజయ్‌కు మాత్రం 85 వరకు మార్కులే వచ్చేవట. హాస్టల్‌లో ఆనంద్ సైలెంట్ కిడ్ అయితే, విజయ్ గ్యాంగ్ లతో గొడవలు పడే టైప్ అని, తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వెళ్లి విజయ్ గొడవ పడేవాడని, విజయ్ అంటే హాస్టల్ హెడ్ మాస్టర్ భయపడేవారట.

ఆనంద్ దేవరకొండను ఇంట్లో ఎక్కువ ముద్దు చేసేవారని, విజయ్ ఆట బొమ్మలు అన్నీ ఆనంద్‌కే దక్కేవని, క్రికెట్‌లో ఆనంద్ ఔట్ అయినా మళ్లీ బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చేవారని, ఆ సమయంలో తమ్ముడి ప్రిఫరెన్స్ చూసి విజయ్‌కు మండిపోయేదట. కొన్నాళ్లకు ఆనంద్‌కు క్రికెట్ మీద ఇష్టం పెరగడంతో, చదువులో 100 మార్కులు కాస్త తగ్గుతూ వచ్చాయట.

విజయ్ దేవరకొండ వాళ్లకు ఒక ఇనిస్టిట్యూట్ ఉండేదట, అందులో స్పోకెన్ ఇంగ్లీష్, మోటివేషనల్ క్లాసులు చెప్పేవారు. ఎవరైనా ఫ్యాకల్టీ రానప్పుడు విజయ్ ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అలా చెప్పినందుకు మంచి అమౌంట్ విజయ్ జేబులో పడేదట.

విజయ్ సినిమా ప్రయత్నాలు చేస్తుంటే, ఆనంద్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెజాన్‌లో ఇంటర్న్ షిప్ చేశారఅట, అప్పుడే సంపాదించడం మొదలు పెట్టారట, ఇంట్లో ఆనంద్ ఆర్థికంగా హెల్ప్ చేసేవారు. అమెరికాలోని డెలాయిట్‌లో ఆనంద్‌కి ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషపడ్డారట. ఆనంద్ కు వచ్చిన జాబ్ వల్ల కుటుంబానికి ఆర్థికంగా భరోసా దక్కిందట. ఆనంద్ యూఎస్ నుంచి రాగానే విజయ్‌కి స్నేహితులతో కలిసి మంచి ట్రీట్ ఇచ్చారట .

రిలేషన్ షిప్ లో ఆనంద్ స్టిక్ అయి ఉంటాడని, తను అలా ఉండలేనని, కెరీర్ కోసమే ఆలోచిస్తానని విజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు విజయ్‌కు సినిమాల్లోకి రాకముందు 30-40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట. ఇక ఏ కష్టాన్ని విజయ్ తమ్ముడి దాకా రాకుండా చూశారట.

ఇక ఆనంద్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ట్రైలర్ ఈనెల 30న రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇంతగా ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ ట్రైలర్ ను ఇటీవల కాలంలో చూడలేదని విజయ్ అన్నారు. ఆనంద్ కూడా రోలర్ కోస్టర్ రైడ్ లా పుష్పక విమానం సినిమా ఉంటుందని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు