‘పుష్పక విమానం’ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ని అనౌన్స్ చేసిన విజయ్.!

Published on Oct 27, 2021 1:00 pm IST


టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం అయ్యి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఫస్ట్ సినిమా నుంచి ఆసక్తికర లైనప్ తో ప్లాన్ చేసుకున్న ఆనంద్ నటించిన లేటెస్ట్ సినిమా “పుష్పక విమానం”. దామోదర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుండగా విజయ్ దేవర కొండ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని చేస్తూ యాక్టీవ్ గా ఉన్నాడు.

మరి అలా ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ని అనౌన్స్ చేసాడు. ఆంధ్ర, సీడెడ్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా నైజాం లో గ్లోబల్ సినిమాస్ వారు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఓవరాల్ గా మంచి బజ్ లో ఉన్న ఈ చిత్రం వచ్చే నవంబర్ 12న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

More