Virosh: విజయ్, రష్మిక పెళ్లి ప్రీమియర్ లీగ్.. డేట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

vijay-rashmika

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ స్టార్స్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాహం కోసం తెలుగు సహా నేషనల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ టాలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు కూడా ఈ వేడుకకి పయనమవడం కూడా మొదలు పెట్టారు. అయితే అసలు పెళ్లి డేట్ ఎపుడు అనేది అధికారికంగా బయటకి రాలేదు.

కానీ లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ స్టోరీతో ఓ క్రేజీ డీటెయిల్ ఇప్పుడు బయటకి వచ్చింది. తమ పెళ్లికి ఒక సెపరేట్ ట్యాగ్ ని వారు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ‘విరోష్’ (VIROSH) అనే పేరుతోనే తమ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతుండగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీలో విరోష్ ప్రీమియర్ లీగ్ అంటూ క్రికెట్ యాంగిల్ లో క్రికెట్ బ్యాట్, ఒక మెడల్ పాప్ కార్న్ డబ్బా ఇంకా బ్యాట్ పై ఈ ఫిబ్రవరి 26 డేట్ కనిపిస్తుంది. సో పెళ్లి జరిగే రోజు కూడా ఇదే అనుకోవచ్చు. అలాగే ఈ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటో కూడా తేలాల్సి ఉంది.

Exit mobile version