నన్ను బాగా విసిగించేవాడు – విజయ్ దేవరకొండ

Published on Oct 24, 2021 4:36 pm IST

సెన్సేషనల్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా రానున్న సినిమా ‘పుష్పకవిమానం’. కాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌ చాట్‌ లో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘స్కూల్‌ లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. అప్పుడు ఆనంద్‌ నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడు’’ అని విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

విజయ్ మాటలు వింటూ ఉన్న ఆనంద్‌ నవ్వుతూ కనిపించాడు. అలాగే విజయ్‌ దేవరకొండ తన తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నాకంటే ముందు ఆనంద్‌ కే పెళ్లి అవుతుంది’ అని అనగానే.. ‘నో అన్నయ్యకే ముందు’ అని ఆనంద్‌ కామెంట్స్ చేశాడు. మొత్తానికి తమ జీవితాల్లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను దేవరకొండ బ్రదర్స్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక పుష్పక విమానం చిత్రానికి దామోదర దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం :