తమిళ్ లో విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా !


విజయ్ దేకారకొండ తీసింది తక్కువ సినిమాలే అయినా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఈ హీరో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో పరుశురం మరియు రాహుల్ , భరత్ దర్శకులతో తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తమిళ్ సినిమా చెయ్యబోతున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.

తమిళ టాప్ హీరో విక్రమ్ తో ‘ఇరుముగన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటన పట్ల ఇంప్రెస్ అయిన ఆనంద్ శంకర్ ఈ హీరోకు ఇటివల స్క్రిప్ట్ వినిపించాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.