టెలివిజన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ

టెలివిజన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ

Published on Dec 22, 2022 10:00 PM IST


టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు తో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి మూవీతో పెద్ద విజయం అందుకుని టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్, అక్కడి నుండి మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన లైగర్ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.

అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ చాలా వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. అయితే విషయం ఏమిటంటే, అటు వెండితెర పై ఫెయిల్యూర్ గా నిలిచిన లైగర్ మూవీ ఇటీవల స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితం అయి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. కాగా ఈ మూవీకి 6. 68 రేటింగ్ దక్కింది. ఇటీవల పెద్ద సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ విక్రమ్ వంటి సినిమాల కంటే టెలివిజన్ లో లైగర్ ఎక్కువగానే టిఆర్పి రాబట్టడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు