సీనియర్ పొలిటీషియన్ ను కాస్త చల్లబడమంటున్న విజయ్ దేవరకొండ !


విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. అందులో భాగంగా సిటీ బస్సులపై పోస్టర్ల ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. ఆ పోస్టర్లలో హీరో హీరోయిన్ల లిప్ లాక్ ఉన్న పోస్టర్ కూడా ఉంది. ఆ పోస్టర్ ను చూసిన సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్ వి. హనుమంతరావుగారికి కోపం కట్టలు తెంచుకుంది.

దీంతో ఆయన బస్సు పై ఉన్న పోస్టర్ ను స్వయంగా చింపేసి ఇప్పటికే సినిమాల వలన యువత చెడిపోతున్నారని, అలాంటిది ప్రభుత్వ బస్సులపై ఇలాంటి పోస్టర్లు తగవని మండిపడ్డారు. దీంతో ఈ వార్త కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తన పేస్ బుక్ ద్వారా హనుమంతరావును ఉద్దేశించి తాతయ్య కాస్త చల్లబడండి అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యవహారంతో సినిమా పట్ల జనాల్లో మరింత అటెంక్షన్ పెరిగిపోయింది.