ఇంకా వివాదంలోనే ఉన్న విజయ్ దేవరకొండ చిత్రం !

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నోటా’కి సంబంధించి ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో ఈ విషయం వార్తల్లో నిలిచింది. అయితే ఈ వివాదాం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. శశాంక్‌ వెన్నలకంటి తన హక్కుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది.

వెన్నలకంటి ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా పై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంది. మరి ఈ వివాదం ఇంకెప్పుడు సమసిపోతుందో చూడాలి. అయితే ఇటీవల రిలీజ్‌ అయిన ఈ చిత్ర టీజర్‌ కు మంచి స్పందన లభించింది. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version