చెన్నై ఈవెంట్ లో దుమ్మురేపిన విజయ్ దేవరకొండ ‘లైగర్’

Published on Aug 14, 2022 12:30 am IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై ఎంతో భారీ ఎత్తున నిర్మితం అయిన లైగర్ ని పూరి జగన్నాథ్ తెరకెక్కించగా రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన లైగర్ టీమ్ మరోవైపు ఇండియా లోని గుజరాత్, ముంబై, పాట్నా వంటి ప్రాంతాల్లో పర్యటించి మూవీ పై మరింత క్రేజ్ పెంచారు.

ఇక నిన్న ఈ మూవీ యొక్క టీమ్ చెన్నై లో సందడి చేయగా అక్కడి ప్రేక్షకాభిమానులు వారికి ఎంతో సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి ప్రేక్షకాభిమానులతో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంత కష్టపడిందని, ఇది మీ అందరూ ఆస్వాదించే డెత్లీ మాస్ మూవీ అన్నారు. గతంలో తాను నటించిన నోటా మూవీ టైం లో తమిళ్ మాట్లాడుతుండడం ఎంతో బాగుండేదని అప్పటి రోజులు గుర్తు చేసుకున్న విజయ్, మళ్ళి చాలా గ్యాప్ తరువాత తమిళ ప్రజలను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ మూవీ ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :