విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ….!!

Published on Jul 16, 2022 5:31 pm IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ లైగర్ రిలీజ్ టైం దగ్గర పడుతున్నకొద్దీ మూవీ పై ఎప్పటికపుడు మంచి హైప్ తీసుకువచ్చేందుకు ఇప్పటికే టీజర్, పోస్టర్స్ తో పాటు ఒక సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్, ఈనెల 21న లైగర్ మూవీ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన టీమ్ తో కలిసి పక్కాగా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ లోని విజయ్ బోల్డ్ లుక్ లో ఉన్న పోస్టర్ ఏకంగా దేశవ్యాప్తంగా సూపర్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.

మరోవైపు రిలీజ్ అయిన అక్డి పక్డి సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దానితో లైగర్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సాలా క్రాస్ బ్రీడ్ అండ్ ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న లైగర్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనుండగా వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో ఒక కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఎక్కువగా మైమా ఫైటర్ అయిన విజయ్ దేవరకొండ షాట్స్ చూపిన్చటం జరిగింది, అయితే ట్రైలర్ లో హీరో విజయ్ తో పాటు మైక్ టైసన్ కి సంబందించిన షాట్స్ కూడా ఉండనున్నాయట.

అలానే ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమా పై మరింతగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడడం ఖాయం అంటోంది యూనిట్. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ స్వయంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీకి ఛార్మి కౌర్, అపూర్వ మెహతా కూడా ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 25న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది, విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా, ఫోటోగ్రఫిని విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్షన్ ని జానీ షేక్ బాషా, ఎడిటర్ గా జునైద్ సిద్దిఖీ, ఫైట్ మాస్టర్ గా కేచ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :