లేటెస్ట్…”కల్కి” నుండి విజయ్ దేవరకొండ లుక్ రిలీజ్!

లేటెస్ట్…”కల్కి” నుండి విజయ్ దేవరకొండ లుక్ రిలీజ్!

Published on Jul 4, 2024 8:27 PM IST

భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి 2898ఎడి చిత్రం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అర్జున పాత్రలో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇచ్చారు.

తాజాగా మేకర్స్ ఈ పాత్రకి సంబందించిన లుక్ ను నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ లుక్ లో విజయ్ దేవరకొండ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు