వైరల్ : ముంబైలో విజయ్ దేవరకొండకు మైండ్ బ్లోయింగ్ క్రేజ్ … !

Published on Jul 23, 2022 8:00 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా విజయ్ ఇందులో కిక్ బాక్సర్ గా కనిపించనున్నారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ వేడుకలు హైదరాబాద్, ముంబైలలో ఇటీవల ఎంతో గ్రాండ్ లెవెల్లో ఫ్యాన్స్, ఆడియన్స్ మధ్యన నిర్వహించారు.అయితే ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకి రణ్వీర్ సింగ్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసారు.

వందలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్, ఈవెంట్ ముగిసిన అనంతరం కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండని ఫాలో చేస్తూనే ఉన్నారు. కాగా ఫ్యాన్స్ అందరినీ ఎంతో పాజిటివ్ గా రీసివ్ చేసుకున్న విజయ్, వారి ప్రేమకి దారిపొడవునా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ విజయ్ ని ఫాలో చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైగర్ పై బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్, ఫస్ట్ సాంగ్, ట్రైలర్ లైగర్ పై అందరిలో సూపర్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంతో తప్పకుండా మూవీ కూడా పెద్ద సక్సెస్ అవుతుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :