వైరల్ పిక్ : రౌడీ హీరోతో ‘ఖుషి’ డైరెక్టర్ & మ్యూజిక్ డైరెక్టర్

వైరల్ పిక్ : రౌడీ హీరోతో ‘ఖుషి’ డైరెక్టర్ & మ్యూజిక్ డైరెక్టర్

Published on Feb 5, 2023 12:07 AM IST


విజయ్ దేవరకొండ ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న మూవీ ఖుషి.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, రౌడీ హీరోకి జోడీగా నటిస్తున్న ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. అయితే విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ, తమ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ తో కలిసి ఒక పిక్ దిగారు. కాగా ఆ పిక్ కొద్దిసేపటి క్రితం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి రొమాంటిక్, లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు