టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, ఆ విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్‌గా ఉంచారని వస్తున్న వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక ఈ జంట ఫిబ్రవరి 26న చారిత్రక నగరమైన ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆదివారం రాత్రి విజయ్, రష్మిక ఇద్దరూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకే వారు ముందుగానే ఉదయ్‌పూర్‌కు బయలుదేరినట్లు సమాచారం. అయితే, ఈ వివాహ వార్తలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకవైపు వ్యక్తిగత జీవితం గురించి ఇన్ని వార్తలు వస్తుండగా, వృత్తిపరంగా కూడా ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సందడి చేయనుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
