ఆ యంగ్ హీరో ‘పవన్ కళ్యాణ్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసేలా ఉన్నాడు ?

Vijay-Devarakonda
ఈ మధ్య కాలంలో పరిశ్రమలో సంచలనం సృష్టించిన చిత్రం ‘పెళ్లి చూపులు’. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోగా అందులో పనిచేసిన వారు సైతం మంచి మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ‘విజయ దేవరకొండ, రీతూ వర్మ’ లు వరుస ఆఫర్ల అందుకుంటున్నారు. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఉత్తమ నటన కనబరిచిన ‘విజయ్ దేవరకొండ’ కు ‘పవన్ కళ్యాణ్’ ఆఫీసు నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.

పవన్ ప్రస్తుత సినిమా నిర్మాత ‘శరత్ మరార్’ విజయ్ కు ఫోన్ చేసి ప్రత్యేక అభినందనలు తెలిపారని అలాగే ఒకసారి కలవాలని అన్నారని అంటున్నారు. దీని వెనకున్న అసలు కారణం ఏమిటని ఆరా తీయగా పవన్ కొత్త సినిమాలో రెండు యంగ్ క్యారెక్టర్లు ఉన్నాయట. వాటిలో ఒకటి విజయ్ చేత చేయించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమై విజయ్, పవన్ కళ్యాణ్ సినిమాలో గనుక నటిస్తే అతని కెరీర్ ఖచ్చితంగా గొప్ప మలుపు తిరిగే అవకాశముంది.