విజయ్ కోరికను అభిమానులు ఎంతవరకు అంగీకరిస్తారో ?

Published on Nov 8, 2021 3:30 pm IST

ఆనంద్ దేవరకొండ హీరోగా గీత్ సైని హీరోయిన్‌ గా రాబోతున్న సినిమా ‘పుష్పక విమానం’ ప్రీమియర్స్ నవంబర్ 11న రాత్రి మహబూబ్ నగర్ లో ఏవిడి మల్టీప్లెక్స్ లో పడబోతున్నాయని.. బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటూ ‘పుష్పక విమానం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కోరాడు. ఇక ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవ్వనుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ చాలా వేగంగా చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర రూపొందించాడు. హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లిలు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ‘సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి, మీ అభిమానం ఎప్పుడూ కావాలని నేను కోరుకుంటాను అంటూ విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. మరి విజయ్ కోరికను అభిమానులు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More