సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ లేటెస్ట్ అప్ డేట్

Published on Feb 20, 2023 8:58 pm IST

విజయ్ దేవరకొండ, సమంత ల కలయికలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అవుతున్న తాజా సినిమా ఖుషి. యువ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై మొదటి నుండి సమంత, విజయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 27న ప్రారంభం కానుండగా మార్చి 8 నుండి సమంత సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. హైదరాబాద్ లో ఎంతో భారీ స్థాయిలో జరిగే ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. అనంతరం యూనిట్ ఏప్రిల్ లో అలెప్పి వెళుతుందని తెలుస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగె ఈ యాక్షన్ లవ్ స్టోరీ లో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. ఇక అతి త్వరలో ఈ మూవీకి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :